Loksabha Elections 2024 : మరో 4 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓటరు మహాశయులకు విజ్ఞప్తి. ప్రలోభాలకు లొంగకుండా నిజాయతీతో ఓటు హక్కు వినియోగించుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలకాంశం. డబ్బు, మద్యం, ఉచితాలు తదితర వాటికోసం ఓటును అమ్ముకోవడం నేరం. బదులుగా భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుంది. మీ పిల్లల భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టే ప్రమాదాన్ని కొనితెచ్చుకోకుండా మీకు ఇష్టమైన అభ్యర్థికి, నమ్మకమున్న వ్యక్తికి మాత్రమే ఓటు వేయండి. ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసైనా మీ నిరసన తెలుపవచ్చు. అంతేకానీ పోలింగ్ రోజు ఇంట్లో కూర్చోని తీరిగ్గా గడపకుండా ఒక్క అరగంట సమయం కేటాయించండి. మద్యాహ్నం వేలల్లో ఎండలు ఎక్కువగా ఉంటున్నందున ఉదయం 10 గంటలలోపు లేదా సాయంత్రం 4 గంటల తరువాత ఓటుహక్కును వినియోగించుకోవచ్చు. ఎండల దృష్ట్యా పోలింగ్ సమయాన్ని ఎన్నికల అధికారులు సాయంత్రం 6 గంటల వరకు పొడిగించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం నగరాల్లో ఉంటున్నవారికి పోలింగ్ రోజున ఉచిత బైక్ రైడ్ సదుపాయం కల్పించనున్నట్లు ర్యాపిడో యాజమాన్యం తెలిపింది.