కొత్త రేషన్ కార్డుల దరఖాస్తులపై మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు. దరఖాస్తు దారుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50లక్షల్లోపు, పట్టణాల్లో రూ. 2లక్షల్లోపు ఉండాలి. 3.5 ఎకరాలలోపు తడి, 7.5 ఎకరాలలోపు మెట్ట భూమి ఉన్నవారు అర్హులు. అయితే ఆంధ్రప్రదేశ్ , తమిళనాడు, కర్ణాటక , గుజరాత్ లలో ఆదాయ పరిమితులు పరిశీలించామని, రాష్ట్రంలోనూ పరిమితి పెంచాలా? తగ్గించాలా? ప్రస్తుత నిబంధనలే కొనసాగించాలా? అనేదానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.