ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అసోసియేట్ అధ్యక్షులుగా కొమరినేని లక్ష్మీ ని నియమించడం జరిగింది. బుధవారం జిల్లా కేంద్రంలోని దేవిశ్రీ గార్డెన్లో జరిగిన సంఘ సమావేశంలో రాష్ట్ర సంఘ ఎన్నికల పరిశీలకుల సమక్షంలో జిల్లా అడ హక్ కమిటీని నియమించడం జరిగింది. ఇట్టి సమావేశంలో ధర్మపురి మండలం నక్కల పేట ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కొమిరినేని లక్ష్మీ ని జిల్లా అడుహక్ కమిటీ అసోసియేట్ అధ్యక్షురాలుగా నియమించడం జరిగింది. అలాగే ప్రాథమిక పాఠశాల న్యూ హరిజనవాడ లో పనిచేస్తున్న కనక తార ని మహిళా కార్యదర్శిగా నియమించడం జరిగింది. ఇట్టి నియమాగానికి సంబంధించి ఉపాధ్యాయ సంఘ నేతలు వారిని అభినందించడం జరిగింది.