ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టులో కొత్తగా ముగ్గురు న్యాయమూర్తులు నియామకం అయ్యారు. దీనికి సంబంధించి అదనపు జడ్జిల నియామకానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదులుగా సేవలందిస్తున్న కుంచం మహేశ్వరరావు, తూట చంద్ర ధనశేఖర్,చల్లా గుణరంజన్ లను అదనపు జడ్జిలుగా నియమించేందుకు ఇటీవల సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేయగా, తాజాగా రాష్ట్రపతి దానిని ఆమోదించారు.