APPSC ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న వారికి గుడ్ న్యూస్ చెప్పింది. పలు ప్రభుత్వ కాలేజీల్లో 464 లెక్చరర్ పోస్టుల నియామకానికి పరీక్ష తేదీలను ప్రకటించింది. జూన్ 16 నుంచి 26 వరకు ప్రభుత్వ పాలిటెక్నిక్, జూనియర్, డిగ్రీ, టీటీడీ డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టుల కోసం పరీక్షలు నిర్వహించనుంది. మే 3 నుంచి మే 9వ తేదీ వరకు గ్రూప్-1 మెయిన్స్, జూన్ 16 నుంచి 26 వరకు జూనియర్ లెక్చరర్ పరీక్ష జరగనుంది.