ఏపీలోని గ్రూప్-1 మెయిన్స్ అభ్యర్థులకు ఏపీపీఎస్సీ శుభవార్త అందించింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఆప్షన్లను మార్చుకునేందుకు ఏపీపీఎస్సీ మరోసారి అవకాశం కల్పించింది. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు మీడియం, పోస్టులు, జోనల్ ప్రాధాన్యత, పరీక్షా కేంద్రాల్లో మార్పులు చేసుకోవచ్చని ప్రకటించారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 2 వరకు ఇలా చేసుకోవచ్చని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేసింది.