Homeహైదరాబాద్latest Newsఏప్రిల్ ఫూల్..ఫుల్ జోష్!

ఏప్రిల్ ఫూల్..ఫుల్ జోష్!

Idenijam, webdesk : ఏప్రిల్ 1. ఈ డేట్ వచ్చిందంటే చాలు, ఏప్రిల్ ఫూల్..ఏప్రిల్ ఫూల్ అంటూ స్నేహితులను ఆటపట్టించడం తెలిసిందే. జోకులు, సెటైర్లు వేస్తూ ఫుల్ జోష్‌గా ఉంటారు కొందరు. అసలు ఎందుకు ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు? ఎప్పటినుంచి ఇది జరుపుకుంటున్నారు? ఏప్రిల్ ఫూల్స్ డే ప్రత్యేకత ఏంటో ఇప్పుడు చూద్దాం.

16 వ శతాబ్దం వరకు యూరప్ లో న్యూ ఇయర్ వేడుకలను మార్చి 25 నుంచి ఏప్రిల్ 1 వరకు గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేవారు. ముగింపు సందర్భంగా ఒకరినొకరు బహుమతులను ఇచ్చిపుచ్చుకునేవారు. 1582 లో అప్పటి ఫ్రాన్స్ రాజు 9వ ఛార్లెస్ సంప్రదాయంగా వస్తున్న క్యాలెండర్‌ను మార్చేసాడు. గ్రిగేరియన్ క్యాలెండర్‌ను ఆమోదించాడు. ఈ క్యాలెండర్ కు అనుగుణంగా జనవరి 1న న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకోవాలని హుకుం జారీ చేశాడు. రాజు ఆదేశాలను ప్రజలు పాటించారు. రాజధానికి దూరంగా ఉన్న కొంతమందికి రాజు ఆదేశాలు అందలేదు. ఈలోగా జనవరి 1 వచ్చింది. చాలామంది న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. రాజుగారి ఆదేశాలు అందనివారు ఏప్రిల్ 1 వరకు ఆగి న్యూ ఇయర్ జరుపుకున్నారు.

జనవరి 1 న సెలబ్రేట్ చేసుకున్నవాళ్లు ఏప్రిల్ 1 న సెలబ్రేట్ చేసుకున్నవాళ్లను ఫూల్స్ అంటూ గేలిచేయడం మొదలుపెట్టారు. పేపర్ చాపల్ని వాళ్ల వెనక భాగాన కట్టి ఆటపట్టించేవాళ్లు. అంతేకాదు చాలా తేలిగ్గా గాలానికి దొరికే చేపల కింద జమకట్టేవాళ్లు. ఏప్రిల్ ఫిష్ అంటూ జోకులేసేవాళ్లు. ఇదే కాలక్రమంలో ఏప్రిల్ ఫూల్స్ డే గా మారిపోయింది. ఇలా ఆటపట్టించే విధానం తర్వాత తర్వాత అమెరికా, బ్రిటన్, స్కాట్లాండ్ దేశాలతో పాటు ప్రపంచమంతా విస్తరించింది. అలా ఒకరిపై ఒకరు సరదాగా జోక్స్ వేసుకొనే ఆనవాయితీ మొదలైంది.

Recent

- Advertisment -spot_img