సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఇన్నేళ్ల సినిమా కెరీర్‌లో ఎన్నో సూపర్ ఆల్బమ్ అందించారు. ఇప్పుడు ఆయన కూతురు కూడా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆమె పేరు ఖతీజా రెహమాన్.. ‘మిన్మినీ’ అనే సినిమాతో సంగీత దర్శకురాలిగా పరిచయం కాబోతుంది. మరి తన నుంచి ఎలాంటి ట్యూన్స్ రానున్నాయో వేచి చూడాలి. ఇక ఈ చిత్రాన్ని హలితా షమీమ్ దర్శకత్వం వహిస్తున్నారు.