Homeహైదరాబాద్latest Newsమోడీ దెబ్బకు అరబ్​ దేశాలు విలవిల

మోడీ దెబ్బకు అరబ్​ దేశాలు విలవిల

ఖతార్‌లో గూఢచర్యం ఆరోపణలతో మరణ శిక్ష ఎదుర్కొంటున్న ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులను ఆ దేశం విడుదల చేసినట్లు భారత విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వారిలో ఏడుగురు సోమవారం తెల్లవారుజామున భారత్‌కు చేరుకున్నట్లు వెల్లడించింది. నేవీ మాజీ అధికారుల విడుదలపై భారత విదేశాంగ శాఖ హర్షం వ్యక్తం చేసింది. ”దహ్రా గ్లోబల్ కంపెనీలో పనిచేస్తున్న భారతీయులను ఖతార్‌ జైలు నుంచి విడుదల చేయడాన్ని భారత ప్రభుత్వం స్వాగతిస్తోంది. ఎనిమిది మందిలో ఏడుగురు భారత్‌కు చేరుకున్నారు. అధికారులను విడుదల చేస్తూ ఖతార్ ఎమిర్ తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు” అని భారత విదేశాంగ శాఖ తెలిపిందని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడి చేసింది. “ప్రధాని మోదీ జోక్యం లేకపోయి ఉంటే భారత్‌కు తిరిగిరావడం సాధ్యమయ్యేది కాదు. భారత ప్రభుత్వ నిరంతర ప్రయత్నాల కారణంగానే ఇది సాధ్యమైంది” అని భారత్‌కు చేరుకున్న ఏడుగురు మాజీ నేవీ అధికారుల్లో ఒకరు అన్నారు. ఎట్టకేలకు మరణ శిక్ష నుంచి విముక్తి పొంది ఖతార్ నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం నేవీ మాజీ అధికారులు ‘భారత్ మాతా కీ జై’ నినాదాలు చేశారు. బిన్ హమద్ అల్ తానీతో సంప్రదింపులు, దౌత్య ప్రయత్నాల ద్వారా తమ విడుదలకు కారణమయ్యారంటూ ప్రధాని మోదీని నేవీ మాజీ అధికారులు ప్రశంసించారు. గూఢచర్యం కేసులో 2022 అక్టోబర్‌లో ఎనిమిది మంది భారత నేవీ మాజీ అధికారులు అరెస్టయ్యారు. వారికి ఖతార్ న్యాయస్ధానం మరణ శిక్ష విధించింది. అనంతరం జీవిత కాల శిక్షగా మార్చింది. మేము భారత‌కు తిరిగి రావడం కోసం 18 నెలలుగా ఎదురు చూస్తున్నాం. ఇన్నాళ్ళకు స్వదేశానికి రాగలిగాం. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆయన వ్యక్తిగత జోక్యం, ఖతార్‌తో సంప్రదింపుల కారణంగానే ఇది సాధ్యమైంది. భారత ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ప్రభుత్వం జోక్యం లేకుండా ఈ రోజు ఇది సాధ్యమయ్యేది కాదు.” అని ఖతార్ నుంచి భారత్ చేరుకున్న తెలుగు వ్యక్తి పాకాల సుగుణాకర్ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.

Recent

- Advertisment -spot_img