ఇదే నిజం, ముస్తాబాద్: ముస్తాబాద్ మండలంలో అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపి అక్రమార్కులు జేబులు నింపుకొంటున్నారు. పట్టపగలు అధికారుల కళ్ళు కప్పి యదేచ్చగా మట్టిని తరలిస్తున్నారు. యంత్రాల సాయంతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల సాయంతో ప్రైవేట్ పనులకు ఇతర స్ధలాలకు మట్టిని తరలిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మట్టి తవ్వకాలు పై ఇప్పటికైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.