Homeహైదరాబాద్latest NewsCool Drinks​ నిజంగానే మేలు చేస్తాయా? వాటిని తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులేంటి?

Cool Drinks​ నిజంగానే మేలు చేస్తాయా? వాటిని తీసుకుంటే శరీరంలో జరిగే మార్పులేంటి?

ఎనర్జీడ్రింక్స్ పేరుతో రకరకాల పానీయాలు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి. ఈ డ్రింక్స్ తాగితే విద్యార్థుల ఫెర్ఫార్మెన్స్ పెరుగుతుందని యాడ్స్ ఊదరగొడుతున్నాయి. ఈక్రమంలో శక్తి వస్తుందని.. వారి ఎదుగుదలకు ఉపయోగపడుతుందని వీటిని విద్యార్థులు తెగ తాగేస్తున్నారు. అయితే ఈ ఎనర్జీ డ్రింక్స్ తాగే విద్యార్థులకు శక్తి కాదు.. అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని తాజా పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. ఎనర్జీ డ్రింక్స్ వల్ల భవిష్యత్తులో చాలా పెద్ద ప్రమాదం పొంచి ఉందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎనర్జీ డ్రింక్స్ వల్ల రాత్రిళ్లు నరకం చూస్తారట. నిద్ర పట్టక విలవిల్లాడతారట. దానికి అనుబంధం కొత్త కొత్త రోగాలతో బాధపడతారట. భవిష్యత్తులో రోగాలతో సావాసం చేస్తారట. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం ఎనర్జీ డ్రింక్స్ లో చక్కెర, విటమిన్లు, మినరల్స్, అమైనో ఆమ్లాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ పదార్థాలు మెదడులోని అడెనోసిస్ అనే నిద్రను ప్రేరేపించే రసాయనాన్ని నిరోధిస్తాయని పరిశోధకులు భావిస్తున్నారు. దీని ఫలితంగా ఎనర్జీ డ్రింక్స్ తీసుకునే వ్యక్తులు నిద్రపోవడం కష్టం

Recent

- Advertisment -spot_img