మీ ఆధార్ ని ఇతరులు వినియోగిస్తున్నారా..? ఇలా తెలుసుకోండి..!
- దీని కోసం https://uidai.gov.in/ పోర్టల్కు వెళ్లాలి.
- అందులో పైన ఎడమ వైపు ఉన్న మై ఆధార్ అనే ఆప్షన్ కనిపిస్తుంది.
- అందులో ఆధార్ సర్వీసెస్పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత కిందకు స్కోల్ చేసి ఆధార్ అథెంటికేషన్ హిస్టరీ అనే ఆప్షన్ను ఎంచుకోగానే కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అందులో లాగిన్పై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.
- తర్వాత కనిపించే స్కీన్లో కిందకు స్కోల్ చేయగానే అథెంటికేషన్ హిస్టరీ అని కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
- అక్కడ ఆల్ ని ఎంచుకొని డేట్ని సెలెక్ట్ చేసుకొని Fetch Authentication History పై క్లిక్ చేయండి.
- ఆధార్కు లింక్ చేసిన ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా మీ ఆధార్ కార్డును ఆరు నెలలుగా ఎక్కడెక్కడ వినియోగించారనే డేటా కనిపిస్తుంది.
- ఇందులో మీకు తెలియకుండా ఆధార్ను ఎక్కడైనా వినియోగించారని అనిపిస్తే వెంటనే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు.
- Advertisment -