Homeహైదరాబాద్latest Newsమీరు ఓయో రూమ్ బుక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

మీరు ఓయో రూమ్ బుక్ చేస్తున్నారా.. తస్మాత్ జాగ్రత్త.. ఇవి ఖచ్చితంగా తెలుసుకోవాలి..!

భారతదేశంలో యువత ఎక్కువగా ఓయో రూమ్స్ ని ఉపయోగిస్తున్నారు. ఓయో రూమ్‌లు తక్కువ అద్దెకు లభిస్తున్నా.. సేఫ్ అనే నమ్మకంతో ఓయో రూమ్‌లను ఎక్కువగా వాడుతున్నారు. ఓయోను 2012లో రితేష్ అగర్వాల్ స్థాపించారు. ప్రస్తుతం, కంపెనీ 80 దేశాలలో 800 కంటే ఎక్కువ నగరాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. మొత్తంగా ఈ కంపెనీకి చెందిన హోటళ్లలో 10 లక్షలకు పైగా గదులున్నాయి. ప్రజలు తమ రూమ్స్ లో సురక్షితంగా ఉన్నారని ఓయో చెబుతున్నప్పటికీ, దాన్ని తనిఖీ చేయడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఇప్పుడు తెలుసుకుందాం.
సాధారణంగా ఇలాంటి హోటళ్లకు వస్తే కెమెరాంటే భయం. తెలుసుకోవడానికి, గదిలోని అన్ని లైట్లను ఆఫ్ చేసి, మీ మొబైల్ ఫోన్ కెమెరాతో చుట్టూ చూడండి. ఎక్కడైనా రెడ్ లైట్ కనిపిస్తే జాగ్రత్తగా ఉండండి. ఎలక్ట్రికల్ ఉపకరణాలు, స్నానపు గదులు తనిఖీ చేయడం చాలా ముఖ్యం. లైట్లు, హీటర్లు, టీవీలు వంటి ఎలక్ట్రికల్ ఉపకరణాలను జాగ్రత్తగా తనిఖీ చేయండి.
అలాగే, మీ చేతిని అద్దాలపై ఉంచండి. మీ రెండు వేళ్లు అద్దాన్ని తాకినట్లయితే, అవతలి వైపు ఉన్న వ్యక్తి కూడా మిమ్మల్ని గాజులో చూడగలరని అర్థం. అప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ రెండు వేళ్ల మధ్య కొంత దూరం ఉంటే, మీరు సురక్షితంగా ఉన్నారని అర్థం. ఇది ఎల్లప్పుడూ సరైనది కానప్పటికీ.. మీరు ఈ పరీక్షను తప్పక చేయాలి.

Recent

- Advertisment -spot_img