తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగకు సొంతూళ్లకు వెళ్లేవారు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసు శాఖ సూచించింది. ‘ఇంట్లో బంగారం, డబ్బులు ఉంచవద్దు. బ్యాంకు లాకర్లలో పెట్టండి. లేదంటే వెంట తీసుకెళ్లండి. ఇంటిని గమనించాలని పక్కింటి వారికి చెప్పాలి. కాలనీల్లో, వీధుల్లో ఎవరైనా కొత్తవారు అనుమానాస్పదంగా కనిపిస్తే పోలీసులకు, డయల్ 100కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలి. ఇలా చేస్తేనే చోరీలను నియంత్రించవచ్చు’ అని పోలీసులు చెబుతున్నారు.