ఏలేశ్వరం పోయినా శనిశ్వరం పోలేదన్నంట్లుగా కేటీఆర్, హరీష్‌రావుల తీరు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. వేములవాడ సభలో ఆయన మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని ఆపడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అధికారం లాక్కోని కేసీఆర్‌ను ఫామ్‌హౌస్‌లో కూర్చోబెట్టినప్పటి నుంచి బీఆర్ఎస్ నేతలకు మతితప్పినట్లు ఉందని చెప్పారు. దమ్ముంటే కేసీఆర్ అసెంబ్లీకి రావాలని, రైతు రుణమాఫీపై చర్చలో పాల్గొనాలని సవాల్ చేశారు.