ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్అ న్నారు. గాంధీభవన్లో ‘మంత్రులతో సమావేశం’ కార్యక్రమం జరిగింది.ప్రజలు, పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడ్తూ.. ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాయని.. పదేళ్లలో కేసీఆర్ ప్రభుత్వం ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారని.. ప్రజలుకు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని అయన ప్రశ్నించారు. ఎన్నో విమర్శలు చేసిన ప్రజలకు ప్రభుత్వంపై నమ్మకం ఉందని పొన్నం అన్నారు.గత ప్రభుత్వం 150 మందికి మాత్రమే విదేశీ విద్యా నిధిని ఇచ్చిందని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం 500 మందికి విదేశీ విద్యా నిధి ఇస్తున్నదని పొన్నం ప్రభాకర్ తెలిపారు.