Homeహైదరాబాద్latest NewsDreams లో ఆవు కనిపిస్తోందా..? అయితే జరగబోయేది ఇదే!

Dreams లో ఆవు కనిపిస్తోందా..? అయితే జరగబోయేది ఇదే!

నిద్రలో మనకు అనేక కలలు వస్తుంటాయి. అయితే, వాటిలో చాలా కలలు మనకు గుర్తుండవు. కానీ కొన్ని మాత్రం పగలు కూడా వెంటాడతాయి. కొందరికి కలలో పాములు, పులులు తదితర జంతువులు కనిపిస్తుంటాయి. అలా కనిపించడం వెనుక అనేక కారణాలు ఉంటాయని కొందరు నమ్ముతారు. స్వప్న శాస్త్రంలో వీటి గురించి స్పష్టంగా వివరించారు. అలాగే ఈజిప్ట్, గ్రీస్ వంటి పురాతన నాగరికతల్లో కూడా కలలకు విశిష్ట స్థానం ఉంది. అప్పటి ప్రజలు కలలను దైవ సంకేతంగా లేదా శక్తిగా పరిగణించేవారు. అలాగే మన పూర్వికులు కలలను దేవుడు ఇచ్చే సంకేతాలుగా భావించేవారు. ఆ కలలు మన జీవితంలో జరగబోయే మంచి చెడులను సూచిస్తాయని తెలిపేవారు. కొందరికి కలలో ఆవులు కనిపిస్తాయి. మరి, ఆవులు కలలో కనిపించడం మంచి సంకేతమేనా? అంటే. అవుననే అంటుంది స్వప్న శాస్త్రం. కలలో తెల్లని ఆవు కనిపిస్తే.. మీకు త్వరలో మంచి ఫలితాలు వస్తాయని అర్థం. ఇన్నేళ్లు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. స్వప్న శాస్త్రం ప్రకారం, కలలో ఆవు పాలు తాగడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. దీని అర్థం త్వరలో మీరు అదృష్టవంతులు అవుతారు. అలాగే విపరీతంగా డబ్బు సంపాదిస్తారు. ఇది ఆరోగ్యం, సంపదః, జ్ఞానం పెరగడానికి సంకేతం. అప్పటి వరకు అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికి ఉపశమనం లభిస్తుంది. ఆవు దూడను కలలో చూడటం మంచిదని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఈ కల మీ జీవితంలో ఆనందాన్ని తెస్తుంది. ఇది మీ ఆర్థిక లాభం, కెరీర్ వృద్ధికి సంకేతం. అంతే కాకుండా, విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల అతి త్వరలో నెరవేరబోతోంది. అని స్వప్న శాస్త్ర నిపుణులు చెప్పుకొస్తున్నారు.

Recent

- Advertisment -spot_img