Skipping breakfast: నేటి బిజీ జీవితంలో చాలా మంది పని ఒత్తిడి మరియు ఇతర కారణాల మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ తినడం మానేస్తారు. అయితే, ఇది అనేక దుష్ప్రభావాలకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అల్పాహారం మానేస్తే రక్తంలో చక్కెర స్థాయిలలో హెచ్చుతగ్గులు ఏర్పడతాయని అంటున్నారు. అలాగే మానసిక ఒత్తిడి పెరుగుతుందని, రోజువారీ జీవితంలో పనితీరును నెమ్మదిస్తుందని, అలాగే ఉత్సాహాన్ని తగ్గిస్తుంది. ఖాళీ కడుపుతో ఎక్కువ సమయం గడపడం వల్ల జీవక్రియ తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.