మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే కనీసం ప్రతిరోజూ 7 నుంచి 9 గంటల నిద్ర తప్పనిసరిగా ఉండాలి.. అలా నిద్ర లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెప్తున్నారు
నిద్రలేమి వల్ల ఆకలిని నియంత్రించే హార్మోన్లను ప్రభావితం చేసి బాగా ఆకలేస్తుంది. దీనివల్ల బరువు పెరిగి ఊబకాయం సమస్య ఏర్పడుతుంది
దీర్ఘకాలిక నిద్ర లేమి అధిక రక్తపోటుకు దారితీస్తుంది
నిద్ర లేమి సమస్య వల్ల గుండె కొట్టుకునే స్థితి గతులు మారుతుంది.. ఇది హార్ట్ స్ట్రోకు దారితీస్తుంది
నిద్రలేమి సమస్య క్రమంగా జ్ఞాపకశక్తి కోల్పోయేలా చేస్తుంది
నిద్రలేమి సమస్య శరీరంలో ఒత్తిడిని పెంచుతుంది
రక్తంలో షుగర్ లెవల్స్, టైప్ 2 డయాబెటిస్ రిస్క్ కూడా పెరుగుతుంది
నిద్ర లేమి సమస్య వల్ల గుండెలో మంట ఏర్పడి గుండె జబ్బులను పెంచేందుకు కారణం అవుతుంది