Homeహైదరాబాద్latest Newsనువ్వు ముఖ్యమంత్రివా.. లేదా..? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

నువ్వు ముఖ్యమంత్రివా.. లేదా..? కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి పై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేసారు. మేము కోకా కోలా కంపెనీ తెస్తే రేవంత్ రెడ్డి పోయి ఫోజులు కొడుతున్నాడు అని బిఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. కాళేశ్వరం నీళ్లు తెచ్చింది మేం.. కోకాకోలా కంపెనీ తెచ్చింది మేం..నువ్వు రిబ్బన్ కటింగ్‌లకు మాత్రమే పనికొచ్చే పనికి మాలిన ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డిపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. నువ్వు ముఖ్యమంత్రివా.. లేదా రియల్ ఎస్టేట్ బ్రోకర్‌వా..అని నిలదీశారు. కేసీఆర్‌కి 1000 ఎకరాల ఫామ్ హౌస్ ఉందని నిరూపిస్తే నీకే రాసి ఇస్తాం అని కేటీఆర్ అన్నారు. ఆర్బీఐ కాంగ్రెస్ వచ్చిన తరువాత 12 నెలల్లో కట్టింది కేవలం రూ.34,730 కోట్లు అంటే నెలకు రూ.2900 కోట్లు మాత్రమే..మరి మిగతా పైసలు ఎక్కడికి పోతున్నయ్ ఢిల్లీకి పోతున్నాయా.. లేదా సీఎం బ్రదర్స్ జేబుల్లోకి పోతున్నయా అని కేటీఆర్ నిలదీశారు.

Recent

- Advertisment -spot_img