‘చలో ‘భీష్మ సినిమాలతో తన ఖాతాలో భారీ విజయాలను నమోదు చేసుకున్న వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ హీరోగా మరో సినిమా వస్తోంది. కామెడీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తోన్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఈ క్రమంలో మరో సీనియర్ హీరో అర్జున్ సర్జా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఆయన పాత్ర నెగిటివ్ షేడ్స్‌తో ఉంటుందని టాక్. ఈ పాత్రను వెంకీ కుడుముల చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడట. కాగా, ‘చలో ‘భీష్మ సినిమాలోని ఫన్ కంటే ఈ సినిమాలో ఫన్ ఇంకా అద్భుతంగా ఉంటుందట. అలాగే ఈ సినిమాలో హీరో – హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా ఫుల్ ఎంటర్టైన్గా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మించబోతుంది. వెంక కుడుముల – నితిన్ కాంబినేషన్లో వచ్చిన భీష్మ సినిమా ప్రపంచ వ్యాప్తంగా భారీ వసూళ్ళను సాంధించి బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. మరోసారి వీరి కాంబో రిపీట్ కానుండటంతో ఆడియెన్స్ నుంచి మంచి హైప్ నెలకొంది.