Homeహైదరాబాద్latest Newsఅరుణాచల్‌ భారత్‌లో భాగమే.. చైనాకు తేల్చిచెప్పిన అమెరికా

అరుణాచల్‌ భారత్‌లో భాగమే.. చైనాకు తేల్చిచెప్పిన అమెరికా

వాషింగ్టన్‌ : అరుణాచల్‌ ప్రదేశ్‌ భారత్‌లో అంతర్భాగమేనని అగ్రరాజ్యం అమెరికా మరోసారి స్పష్టం చేసింది. అమెరికా రక్షణ శాఖ డిప్యూటీ అధికార ప్రతినిధి వేదాంత్‌ పటేల్‌ ఈ విషయాన్ని వెల్లడించారు. అరుణాచల్‌ను దక్షిణ టిబెట్‌గా (జాంగ్నాన్) అభివర్ణిస్తున్న చైనా..అది తమదేనంటూ ఆ దేశ సైన్యం ఇటీవల ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. సైన్యం లేదా పౌరులు వాస్తవాధీన రేఖ (LAC) అవతల ఆక్రమణలకు పాల్పడటానికి ఎలాంటి ప్రయత్నాలు చేసినా తాము దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తామని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img