HomeరాజకీయాలుArvind Dharmapuri : రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్

Arvind Dharmapuri : రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్ బెటర్

– రాష్ట్రంలో రాబోయేది హంగ్​ ప్రభుత్వమే
– బీజేపీ ఎంపీ అర్వింద్​ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కంటే సీఎం కేసీఆర్ మంచివారని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఆదివారం జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీజేపీ ఆధ్వర్యంలో హంగ్ ప్రభుత్వం రానుందని ఆయన జోస్యం చెప్పారు. ప్రస్తుతం ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్‌ కోరుట్ల నుంచి బీజేపీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. కోరుట్లలో అర్వింద్‌ ఇప్పటికే ప్రచారం ప్రారంభించి దూసుకుపోతున్నారు. ఇంట్రెస్టింగ్‌ కామెంట్లతో ప్రత్యర్థులపై విరుచుకుపడే అర్వింద్‌ రేవంత్‌ కంటే కేసీఆర్‌ బెటర్ అని మంచివారని అనడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీ పోరు ప్రధానంగా బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ మధ్య జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రేవంత్‌ కంటే కేసీఆర్‌ బెటరని అర్వింద్‌ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.

Recent

- Advertisment -spot_img