దీపావళి కానుకగా సూపర్ సిక్స్‌లో భాగంగా ఉచిత సిలిండర్ల పథకం అమల్లోకి తీసుకురాబోతోంది కూటమి ప్రభుత్వం. ఇప్పటికే దీనికి సంబంధించిన గ్యాస్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ పథకం లబ్ధిదారులకు గుడ్‌న్యూస్ చెబుతూ.. దీపం-2 పథకానికి రూ.2,684కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. మొదటి విడతకు అయ్యే ఖర్చు రూ. 894 కోట్లు మొత్తాన్ని పెట్రోలియం సంస్థలకు ముఖ్యమంత్రి చంద్రబాబు అందజేశారు.