ఇదే నిజం,గొల్లపల్లి : బీసీల ఆత్మగౌరవ ప్రతీక బీసీల హక్కుల కోసం అహర్నిశలు పోరాడుతున్నా ఉద్యమ నేత బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య ని బీసీ విద్యార్థి సంఘం జగిత్యాల జిల్లా అధ్యక్షులు న్యాయవాది జాజాల రమేష్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నుండి రాజ్య సభ సభ్యులుగా ఎన్నికైన ఆర్ కృష్ణయ్య ని హైదరబాద్ బీసీ భవన్ లో జాజాల రమేష్ మర్యాదపూర్వకంగా కలసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం తెలంగాణలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికలో బీసీ రిజర్వేషన్ల పెంపు విషయం పై పలు అంశాలపై చర్చించారు.