తొలి టెస్టులో బంగ్లాదేశ్ పై భారత్ 280 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 515 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 234 పరుగులకే కుప్పకూలింది. తొలి ఇన్నింగ్స్ లో సెంచరీతో మెరిసిన అశ్విన్ రెండో ఇన్సింగ్స్ లో 6 వికెట్లతో అదరగొట్టాడు. ఇక భారత్ తొలి ఇన్సింగ్స్ లో 376/10 పరుగులు చేయగా, బంగ్లా 149 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో ఇన్సింగ్స్ లో భారత్ 287/4 డిక్లేర్డ్ చేసి 515 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా, బంగ్లా 234 పరుగులే చేసింది. ఈ మ్యాచ్ లో ఇటు బ్యాట్ అటు బాల్ తోను అదరగొట్టిన అశ్విన్ కి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.