Homeహైదరాబాద్latest NewsAsia Cup 2024 Final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. భారత్ X శ్రీలంక.....

Asia Cup 2024 Final: కాసేపట్లో ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్.. భారత్ X శ్రీలంక.. ఫ్రీగా మ్యాచ్ చూడొచ్చు.. ఎక్కడంటే?

మహిళల ఆసియా కప్ టీ20 టోర్నీలో వరుస విజయాలతో దూసుకెళ్తున్న టీమిండియా తుది పోరుకు సిద్ధమైంది. హర్మన్ ప్రీత్ కౌర్ సారథ్యంలో అజేయ ఫైనల్ చేరిన టీమిండియా ఎనిమిదో టైటిల్ పై కన్నేసింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంకతో భారత్ తలపడనుంది. ఈ టోర్నీకి స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ అధికారిక బ్రాడ్‌కాస్టర్‌గా వ్యవహరిస్తోంది. స్టార్ స్పోర్ట్స్‌కు సంబంధించిన అన్నీ చానెల్స్‌లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌కు చెందిన డిస్నీ హట్‌స్టార్‌లోనూ ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది. హాట్ స్టార్‌‌లో సబ్‌స్క్రిప్షన్ లేకున్నా ఈ మ్యాచ్‌ను ఫ్రీగా చూడవచ్చు.

Recent

- Advertisment -spot_img