Homeహైదరాబాద్latest NewsBREAKING : POL - 2023 @ తిరుపతన్న

BREAKING : POL – 2023 @ తిరుపతన్న

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏఎస్పీ తిరుపతన్న కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావు, భుజంగరావు ఆదేశాలతో విచ్చలవిడిగా అధికారం దుర్వినియోగానికి పాల్పడ్డారు. POL – 2023 పేరుతో ప్రత్యేక టీంను ఏర్పాటు చేసుకున్నారు. ఇద్దరు సీఐలు, 10 మంది కానిస్టేబుళ్లు, 10 మంది head కానిస్టేబుళ్లతో టీం నడిపించారు. మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్, పొంగులేటి కి చెందిన డబ్బులను పట్టుకున్నట్లు తెలుస్తోంది. రేవంత్ సన్నిహితుడు గాలి అనిల్ కుమార్ కు చెందిన డబ్బులను పట్టుకొని సీజ్ చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే లక్ష్యంగా పని చేసినట్లు రుజువవుతోంది. ప్రతిరోజూ 40 మంది ఫోన్లు ట్యాప్ చేసినట్టు ఒప్పుకొన్నారు. ప్రణీత్ కుమార్ ఇచ్చిన సమాచారంతో 15 ఆపరేషన్లు నిర్వహించారు. రాఘవ ఇన్‌ఫ్రా డబ్బులను పెద్దమొత్తంలో స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి ఎన్నిక కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img