ఈ నెల 19న అస్సాంలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 350 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. సోనిట్‌పూర్ ఫులోగురీ నేపాలీ పామ్ గ్రామం నుంచి ఈ విషయం వెలుగుచూసింది. అదే గ్రామానికి చెందిన దివంగత బహదూర్ తాపా అనే వ్యక్తి అయిదుగురు భార్యల ద్వారా 12 మంది కొడుకులు, 9 మంది ఆడపిల్లలను కన్నారు. కోడళ్లు, అల్లుళ్లు, పిల్లలు, మనవళ్లు, మునిమనవళ్లతో కలిపి మొత్తం జనాభా 1200 కు చేరింది. వీరందరూ అదే గ్రామంలో 300 ఇళ్లల్లో నివసిస్తున్నారు. ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతోంది.
అస్సాంలో 14 ఎంపీ స్థానాలకు గాను మూడు దశల్లో పోలింగ్ జరగనుంది. ఏప్రిల్ 19, ఏప్రిల్ 26, మే 7 న ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు జూన్ 4న వెలువడనున్నాయి.