ఇదే నిజం, చేవెళ్ల : అస్సాం (Assam) శాసనసభ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ నుమల్ మోమిన్ కు చేవెళ్లలో బీజేపీ నాయకులు గురువారం ఘనంగా స్వాగతం పలికారు. చేవెళ్ల మీదుగా కర్ణాటకకు వెళ్తున్న ఆయనకు బీజేపీ చేవెళ్ల మండలాధ్యక్షుడు అత్తెల్లి అనంత్ రెడ్డి, యువ నాయకులు డా.వైభవ్ రెడ్డి ఆధ్వర్యంలో చేవెళ్ల బీజేపీ నాయకులు స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన వారితో కాసేపు ముచ్చటించారు. వారికి స్వాగతం పలికిన వారిలో నాయకులు గణేష్ మచ్చేందర్ రెడ్డి, అభిషేక్ రెడ్డి, వెంకటేష్, గణేష్, మధుకర్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, త్రినేత్ర, ప్రశాంత్ రెడ్డి, కరుణాకర్, బీరప్ప, భార్గవ్ రెడ్డి, జయసింహా రెడ్డి, హర్షిత్ తదితరులు ఉన్నారు.