HomeతెలంగాణAssembly:ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ..

Assembly:ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ..

ఆగస్టు 3 నుంచి అసెంబ్లీ..

  • ఈ నెల 31న కేబినేట్ సమావేశం
  • వరదలపైనే ప్రధాన సమీక్ష
  • 50 అంశాలపై నిర్ణయాలు

ఇదే నిజం, స్టేట్ బ్యూరో: వచ్చే నెల ఆగస్టు 3 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించబోతున్నారు. మరోవైపు ఈనెల 31న మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో కేబినెట్‌ భేటీ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో వరదలు, ఇతర అంశాలపై చర్చించనున్నారు. వీటితో పాటు సుమారు 50 అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రాష్ట్రంలో రైతాంగం వ్యవసాయ సాగు పనులు కొనసాగుతున్న నేపథ్యంలో.. అకాల వర్షాలతో తలెత్తిన పరిస్థితులను అంచనా వేస్తూ అనుసరిచాల్సిన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు జీతభత్యాల పెంపు తదితర అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశముంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img