Homeహైదరాబాద్latest NewsAssembly Elections : చత్తీస్‌గఢ్‌, మిజోరంలో మొదటి విడత పోలింగ్‌ ప్రారంభం

Assembly Elections : చత్తీస్‌గఢ్‌, మిజోరంలో మొదటి విడత పోలింగ్‌ ప్రారంభం

ఇదే నిజం, నేషనల్ బ్యూరో: చత్తీస్‌గఢ్‌, మిజోరం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ మంగళవారం ప్రారంభమైంది. చత్తీస్‌గఢ్‌లో తొలి విడతలో 20 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్‌ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమైంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 7 జిల్లాల్లో పోలింగ్‌ జరుగుతుండటంతో.. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బస్తర్‌, జగదల్‌పూర్‌, చిత్రకోట్‌లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుండగా.. సమస్యాత్మక ప్రాంతాల్లో మధ్యాహ్నం 3గంటలకు కు పోలింగ్‌ ముగియనుంది. తొలి విడతలో పోలింగ్‌ జరిగే 20 స్థానాల్లో 223 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో మొత్తం 90 శాసనసభ స్థానాలు ఉండగా.. మిగతా 70 స్థానాలకు ఈ నెల 17 పోలింగ్‌ జరగనుంది. మరోవైపు మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్‌ కొనసాగుతోంది. మొత్తం 40 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్‌ జరుగుతోంది. ఇక్కడ ఎన్నికల బరిలో 174 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.


ఓటేసిన మిజోరం సీఎం జోరంథంగా

మిజోరం సీఎం జోరంథంగా అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈవీఎం సమస్య కారణంగా తొలి గంటల్లో ఓటు వేయలేక వెళ్లిపోయిన ఆయన.. ఆ తర్వాత మళ్లీ వచ్చి ఓటేశారు. మిజో నేషనల్‌ ఫ్రంట్‌ అధ్యక్షుడు, సీఎం జోరంథంగా.. ఉదయం ఐజ్వాల్‌ నార్త్‌-2 నియోజకవర్గ పరిధిలోని 19-ఐజ్వాల్‌ వెంగ్లాయ్‌-1 పోలింగ్‌ కేంద్రానికి వెళ్లారు. అయితే అక్కడి ఈవీఎం పనిచేయకపోవడంతో ఆయన ఓటు వేయలేకపోయారు. కొంతసేపు ఎదురుచూసి వెనుదిరిగారు. ఆ తర్వాత ఉదయం 11గంటల ప్రాంతంలో మళ్లీ పోలింగ్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు.

Recent

- Advertisment -spot_img