HMDA టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ బాలకృష్ణను అధికారులు అరెస్ట్ చేశారు. గురువారం తెల్లవారు జామున బాలకృష్ణను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నిన్నటి అధికారులు బాలకృష్ణ ఆస్తులపై దాడులు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ దాడుల్లో రూ.100కోట్లకు పైగా స్థిర, చరాస్థులు బయటపడ్డాయి.
ఇది కూడా చదవండి: గుర్రంతో గొర్రు తోలాడు.. వైరల్ వీడియో
14 టీమ్ లతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. బ్యాంక్ డిపాజిట్లతో పాటు బినామీలను గుర్తించారు. బ్యాంక్ లాకర్స్ పై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఏసీబీ అధికారులు దర్యాప్తు చేస్తుండగా బాలకృష్ణ కుటుంబ సహకరించనట్లు తెలుస్తోంది.