మేషం
ఈ వారం ఈ రాశి వారికి సంకల్ప బలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్థ్యాలపై నమ్మకం పెంచుకోండి. యత్నాలకు సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొంత మొత్తం సాయం చేయండి. పనుల సానుకూలతకు ఓర్పు, కృషి ప్రధానం. పిల్లల విదేశీ విద్యాయత్నం ఫలిస్తుంది. స్థిరచరాస్తుల వ్యవహారంలో ఏకాగ్రత వహించండి. సన్మాన, సంస్మరణ సభల్లో పాల్గొంటారు. ఇష్ట దేవతా ఆరాధన చేయండి. అంతా మంచి జరుగుతుంది.
వృషభం
ఈ వారం ఈ రాశి వారికి మీదైన రంగంలో అనుభవం గడిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఫలిస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. మానసికంగా స్థిమిత పడతారు. పెట్టుబడులు కలిసిరావు. ప్రణాళికా బద్దంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బాధ్యతలు అప్పగించవద్దు. సోమవారం నాడు అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. గణపతి ఆలయాన్ని దర్శించండి. మంచి జరుగుతుంది.
మిథునం
ఈ వారం ఈ రాశి వారికి సంకల్పం సిద్ధిస్తుంది. ధన లాభం, వాహనసౌఖ్యం ఉన్నాయి. సమర్థతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. ఏది జరిగి ఒందుకు మంచికే. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. సన్నిహితులతో సంభాషిస్తారు. వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.
కర్కాటకం
ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే సమయం. ప్రతికూలతలను దీటుగా ఎదుర్కొంటారు. మీ కార్యదీక్ష అందరినీ ఆకట్టు కుంటుంది. కష్టమనుకున్న పనులు సునాయాసంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికంగా ఉంటాయి. డబ్బుకు ఇబ్బంది ఉండదు. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది. పత్రాల్లో సవరణలు సాధ్యమవుతాయి. అమ్మవారిని ధ్యానించండి.
సింహం
ఈ వారం ఈ రాశి వారికి ఆశావహదృక్పథంతో యత్నాలు సాగిస్తారు. సన్నిహితుల ప్రోత్సాహం ఉంటుంది. అవకాశాలను అందిపుచ్చు కుంటారు. ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చు లుంటాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. స్నేహసంబంధాలు బలపడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. అమ్మవారి ధ్యానం చేయండి.
కన్య
ఈ వారం ఈ రాశి వారికి ప్రతికూలతలు అధికంగా ఉన్నాయి. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్థ్యంపై నమ్మకం తగ్గుతుంది. ఆశావాహ దృక్పథంతో మెలగండి. అతిగా ఆలోచించొద్దు. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. సోమవారం నాడు పనులు మంద కొడిగా సాగుతాయి. ఈ చికాకులు తాత్కాలికమే. త్వరలో పరిస్థితులు చక్కబడతాయి. పిల్లలకు ఉన్నత విద్యావకాశం లభిస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు.
తుల
ఈ వారం ఈ రాశి వారికి లక్ష్యసాధనకు ఓర్పు ప్రధానం. మనోధైర్యంతో యత్నాలు సాగించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. పట్టుదలకు పోవద్దు. సౌమ్యంగా మెలగండి. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఒక సమాచారం ఉత్తేజ పరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. కొత్త వ్యక్తులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. అవివాహితులు శుభవార్త వింటారు. హనుమాన్ చాలీసా పఠించండి. శుభాలు చేకూరతాయి.
వృశ్చికం
ఈ వారం ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. ఇంటా బయటా ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. గురు, శుక్రవారాల్లో అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. పనులు, కార్యక్రమాలు సాగవు. సోదరుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. మీ అభిప్రాయాలను స్పష్టంగా తెలియచేయండి. గోవిందా నామాలు పఠించండి.
ధనుస్సు
ఈ వారం ఈ రాశి వారికి కార్యక్రమాలు విజయవంతమవుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రముఖులకు సన్నిహితులవుతారు. శనివారం నాడు అప్రమత్తంగా ఉండాలి. అజ్ఞాతవ్యక్తులు తప్పుదారి పట్టించేందుకు యత్నిస్తారు. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. మొహమాటాలకు పోవద్దు. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి.
మకరం
ఈ వారం ఈ రాశి వారికి వ్యవహార ఒప్పందాల్లో అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఆది, సోమ వారాల్లో ధన సమస్యలు ఎదురవుతాయి. చెల్లింపులు వాయిదా వేసుకుంటారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉత్సాహపరుస్తుంది. పిల్లల భవిష్యత్తుపై దృష్టి సారిస్తారు. గృహమార్పు అనివార్యం. నోటీసులు అందుకుంటారు. సూర్యారాధన శుభ ఫలితాలు అందిస్తుంది.
కుంభం
ఈ వారం ఈ రాశి వారికి ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ఆదాయం బాగుంటుంది. మంగళవారం నాడు పెద్దఖర్చు తగిలే ఆస్కా రం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. ప్రతి చిన్న విషయానికీ చికాకుపడతారు. మాటతీరు అదుపులో ఉంచుకోండి. వ్యాపకాలు సృష్టించుకోవటం శ్రేయస్కరం. మాన సికంగా కుదుటపడతారు. ఆధ్యాత్కిక, సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
మీనం
ఈ వారం ఈ రాశి వారికి మీ పనితీరు ప్రశంసనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. మరింత బాధ్యతగా వ్యవహరించాలి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. అజ్ఞాతవ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. ఆప్తుల రాక ఉత్సాహాన్నిస్తుంది. గృహనిర్మాణాలు పూర్తికా వస్తాయి. శుభకార్యానికి సన్నాహాలు సాగిస్తారు. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు.