Homeహైదరాబాద్latest Newsసైనిక విన్యాసాల్లో అపశృతి

సైనిక విన్యాసాల్లో అపశృతి

మలేషియా నేవీ వార్షిక వేడుకల్లో అపశృతి చోటుచేసుకుంది. ఉత్తర పెరాక్ నౌకాదళ స్థావరంలో శిక్షణా కార్యక్రమంలో 2 సైనిక హెలికాప్టర్లు ఢీకొన్నాయి. 90వ వార్షికోత్సవ వేడుకల కోసం సన్నాహాలు చేస్తుండగా రెండు సైనిక హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో 10 మంది దుర్మరణం చెందారు. వీరిలో ఇద్దరు లెఫ్టినెంట్ కమాండర్లు ఉన్నారు. హెలికాప్టర్లు కూలుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఈ దుర్ఘటనపై అధికారులు విచారం వ్యక్తం చేశారు. ఇటీవలే జపాన్‌లో హెలికాప్టర్లు ఢీకొన్న ఘటనలో గల్లంతైన వారి ఆచూకీ తెలియరాలేదు.

Recent

- Advertisment -spot_img