నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన ‘అలయ్ బలయ్’ నిర్వహిస్తున్నారు.కళాకారుల సంప్రదాయ నృత్యాలు.. పోతురాజ్ విన్యాసాలు, హైదరాబాదీ సంప్రదాయ మార్ఫా వాయిద్య సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ముఖ్య అతిథిగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరుకానున్నారు. కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మీత్‌సింగ్, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, తెలంగాణ వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి పాల్గొన్నారు.