స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం హిందీ వెబ్ సిరీస్ సిటాడెల్: హనీ బన్నీలో ప్రధాన పాత్రలో నటించింది. ఈ సిరీస్ లో బాలీవుడ్ స్టార్ వరుణ్ ధావన్ హీరోగా నటించాడు. అయితే తాజాగా ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్‌లో భాగంగా రాజకీయ నేత కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై సమంత స్పందించింది.ఇందులో భాగంగానే ఈ ఘటన జరిగినప్పుడు సినీ పరిశ్రమ తనకు అండగా నిలిచిందన్నారు. ఈ క్రమంలోనే సౌత్ ఇండస్ట్రీ నాలో ధైర్యాన్ని నింపింది అని సమంత తెలిపారు..ఇండస్ట్రీ, మీడియా మరియు అభిమానులు చూపించిన ప్రేమే ఈ వివాదం నుంచి తాను ఈ సంఘటన నుంచి త్వరగా కోలుకుని బయటకు వచ్చేలా చేసిందని, లేకుంటే మరింతగా కుంగిపోయేదానినని చెప్పుకొచ్చింది. అందరి మద్దతు వల్లనే ఈరోజు నేను మీ ముందు కూర్చున్నాను మరియు ఇలాంటి కష్ట సమయాల్లో నన్ను ఆదరించిన ప్రతి ఒక్కరికీ సమంత ధన్యవాదాలు తెలిపింది.అయితే ఈ ఘటన జరగగానే టాలీవుడ్ ప్రముఖ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, ఎన్టీఆర్, మహేష్ బాబు, రామ్ చరణ్, అక్కనేని నాగ చైతన్య తదితర స్టార్ హీరోలు స్పందించి నటి సమంతకు మద్దతుగా నిలిచారు.