HomeరాజకీయాలుAtchennaidu : YCP bus tour as opposition grows Atchennaidu : వ్యతిరేకత...

Atchennaidu : YCP bus tour as opposition grows Atchennaidu : వ్యతిరేకత పెరిగిందనే YCP బస్సు యాత్ర

– ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో వైసీపీపై వ్యతిరేకత పెరగడం వల్లే.. ఆ పార్టీ నేతలు బస్సు యాత్ర చేయాలనుకుంటున్నారని ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆరోపించారు. టీడీపీ కేంద్ర ఆఫీసు ఎన్టీఆర్ భవన్‌లో ముఖ్య నేతలు సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ‘పేదల గొంతు కోస్తున్న పెత్తందారు జగన్‌ రెడ్డి’ పాంప్లెంట్​ను ఆవిష్కరించారు. వైసీపీ సామాజిక సాధికారత బస్సు యాత్రపై మండిపడ్డారు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య ఘటనపై ఎస్సీల్లో చైతన్యం కలిగించేలా కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. రేపల్లెలో పదో తరగతి చదివే బీసీ విద్యార్థి దహనం చేసిన ఘటనకు వైసీపీ సమాధానం చెప్పేలా.. బస్సు యాత్రకు వచ్చే వైసీపీ నేతలపై ఒత్తిడి తేవాలని నేతలు స్పష్టం చేశారు. నంద్యాలలో మైనార్టీ వ్యక్తి సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనను వైసీపీకి గుర్తు చేయాలన్నారు. రద్దు చేసిన పథకాలపై సమాధానం చెప్పిన తర్వాతే వైసీపీ బస్సు యాత్ర చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. ‘ఎస్టీలవి 29 పథకాలు, మైనార్టీలవి 11 పథకాలు రద్దు చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై ఇంత ఊచకోత ఎప్పుడైనా చూశామా? ఇన్ని అక్రమాలు ఎప్పుడైనా చూశామా? ఇన్ని అరాచకాలపై జగన్‌ను ప్రశ్నించే ధైర్యం ఏ మంత్రికైనా ఉందా?’అని అచ్చెన్న నిలదీశారు.

Recent

- Advertisment -spot_img