ఉత్తరప్రదేశ్ లోని బల్లియాలో తాజాగా దారుణ ఘటన జరిగింది. 19 ఏళ్ళ యువతిపై ఓ యువకుడు కన్నేశాడు. శుక్రవారం రాత్రి యువతి ఒంటరిగా ఉన్న సమయంలో ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి బెదిరించి బలవంతంగా అత్యాచారం పాల్పడ్డాడు. యువతి ఫిర్యాదు మేరకు పీఎస్ ఇన్ చార్జి అతుల్ కుమార్ మిశ్రా కేసు నమోదు చేసి విచారణ చేపట్టి ఆదివారం నిందితుడిని అరెస్ట్ చేశారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ఆసుపత్రికి తరలించారు.