యూపీ ప్రభుత్వం ఇచ్చే డబ్బు కోసం 8వ తరగతి బాలికకు వివాహం చేయడం ఆలస్యంగా వెలుగుచూసింది. సీఎం సామూహిక్ వివాహ్ యోజన కింద జనవరి 27న పిలిభిట్‌లో ‘934 వెడ్డింగ్స్’ కార్యక్రమం నిర్వహించారు. అయితే.. అప్పుడు తాను ఊర్లో లేనని, భర్త చనిపోగా అంత్యక్రియల కోసం వచ్చేసరికి విషయం తెలిసిందని బాలిక తల్లి శీతల్ దేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితులు తన కుమార్తె వయసు దాచేందుకు సర్టిఫికెట్లను మార్ఫింగ్ చేశారన్నారు.