Homeహైదరాబాద్latest Newsగుంటూరు జిల్లాలో దారుణం.. గన్ తో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో దారుణం.. గన్ తో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

గుంటూరు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలో జరిగింది. గుంటూరు జిల్లా చుట్టుగుంటలో వంశీ శ్రీనివాస్ ఏఆర్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో ఈరోజు ఎస్కార్ట్ వాహనంలో తుపాకీతో పాయింట్ బ్లాంక్‌ లో కాల్చుకున్నాడు. దీంతో వంశీ శ్రీనివాస్ అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వంశీ శ్రీనివాస్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img