వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. తాండూరు బసవేశ్వర నగర్ లో కుక్క దాడిలో 5 నెలల బాలుడు మృతి చెందాడు. తాండూరులో నాపరాతి పాలిష్ యూనిట్ లో దత్తు, లావణ్య దంపతులు పనిచేస్తున్నారు. ఈ క్రమంలో మంగళవారం తమ బాలుడిని ఇంట్లో పడుకోబెట్టి లావణ్య ఇంటి పనిచేస్తుంది. డోర్ తెరిచి ఉండటంతో ఇంట్లోకి కుక్క చొరబడి పసికందుపైకి దాడికి దిగింది. కుక్క తీవ్రంగా దాడి చేయడంతో రక్తపు మడుగులో బాలుడు అక్కడికక్కడే మరణించాడు.