Homeహైదరాబాద్latest Newsవిశాఖపట్నంలో దారుణం.. లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారం

విశాఖపట్నంలో దారుణం.. లా విద్యార్థినిపై నలుగురు సామూహిక అత్యాచారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నంలో మరో దారుణం చోటు చేసుకుంది. లా చదువుతున్న విద్యార్థినిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమెపై నలుగురు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ అత్యాచారం దృశ్యాలను సెల్‌ఫోన్లలో రికార్డు చేశారు. ఆ వీడియోలతో బాధితురాలిని పలుమార్లు బెదిరించారు అత్యాచారానికి పాల్పడ్డారు.. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితురాలు మధురవాడలోని ఎన్వీపీ లా కళాశాలలో మూడో సంవత్సరం చదువుతోంది. ఆమె తన తోటి విద్యార్థి వంశీతో స్నేహం చేస్తుంది. పెళ్లి చేసుకుంటానని వంశీ ఆమెను నమ్మించి.. గత ఆగస్టు 10న కంబాలకొండకు తీసుకెళ్లాడు. అక్కడ విద్యార్థినిపై వంశీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆగస్టు 13న వంశీ విద్యార్థినిని దాబా గార్డెన్‌లోని తన స్నేహితుడు ఆనంద్ ఇంటికి తీసుకెళ్లి మరోసారి అత్యాచారం చేశాడు.ఆ తర్వాత వంశీ స్నేహితులు ఆనంద్, రాజేష్, జగదీష్ కూడా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆమెను వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డారు.
రెండు నెలల తర్వాత ఆనంద్, రాజేష్, జగదీష్ బాధితురాలికి ఫోన్ చేసి తమ వద్దకు రావాలని, లేకుంటే వీడియోలు బయటపెడతామని బెదిరించారు. ఈ విషయాన్ని ఆమె వంశీ దృష్టికి తీసుకెళ్లింది. తమ కోరిక తీర్చాలంటూ వంశీ కూడా ఆమెను వేధించాడు. ఆమెను రోజురోజుకు వేధించారు.నలుగురి వేధింపులు తాళలేక బాధితురాలు ఈ నెల 18న ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. యువతిని గమనించిన తలితండ్రులు ఆమెను కాపాడారు. విషయం తెలుసుకున్న బాధితురాలి తండ్రి విశాఖపట్నం టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

Recent

- Advertisment -spot_img