మధ్యప్రదేశ్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు మహిళలపై ట్రక్కుతో మట్టిని తెచ్చి పోసి పూడ్చిపెట్టేందుకు ప్రయత్నించారు. అయితే స్థానికులు మట్టిని తొలగించి కాపాడారు. గ్రామంలో రోడ్డు నిర్మాణ పనులు జరుగుతుండగా.. తమ భూమిని ఇచ్చేది లేదని మహిళలు అడ్డుపడ్డారు. అక్కడే బైఠాయించి నిరసన తెలుపుతుండగా ఈ దారుణానికి ఒడిగట్టారు.