ఉత్తరప్రదేశ్ లో దారుణ ఘటన చోటుచేసుకుంది. అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి కాంప్లెక్స్ లో క్లీనర్ గా పనిచేస్తున్న దళిత మహిళపై సామూహిక అత్యాచారం జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. మిగతా వారికోసం గాలిస్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించిన సమాచారం మేరకు.. మహిళ తనకు తెలిసిన యువకుడిని కలిసేందుకు వెళితే అక్కడ అతని స్నేహితులు మహిళపై అత్యాచారం చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.