Homeహైదరాబాద్latest Newsహన్మకొండలో దారుణం..పసికందును పూడ్చిపెట్టారు

హన్మకొండలో దారుణం..పసికందును పూడ్చిపెట్టారు

Hanamkonda : మానవత్వం మంటకలిసిపోతోందనడానికి మరో ఉదాహరణగా హన్మకొండ జిల్లాలో ఓ దుర్ఠటన జరిగింది. ముక్కుపచ్చలారని ఓ పసికందును బతికుండగానే పూడ్చిపెట్టి ఘోర తప్పిదాన్ని చేశారు కొందరు ఆగంతకులు. నిన్న (శనివారం) ఉదయం దామెర మండలం పసరగొండ క్రాస్ వద్ద జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నీటికోసం వచ్చిన ట్యాంకర్ డ్రైవర్ బిడ్డ కాళ్లు కదపడం గమనించి హుటాహుటిన స్పందించాడు. అటుగా వెళ్తోన్న ఉపాధి హామీ కూలీలతో కలిసి ఆడశిశువును బయటకు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. బిడ్డను అస్పత్రికి తరలించామని, ఆరోగ్యం నిలకడగా ఉందని వారు తెలిపారు.

Recent

- Advertisment -spot_img