ఐస్‌క్రీంలో పురుగులు వస్తేనే ఆశ్చర్యపోతాం. కానీ ఇప్పుడు మానవ అవయవాలు కూడా వస్తున్నాయి. ముంబైలోని ఓర్లెమ్ బ్రెండన్ సెర్రావో అనే డాక్టర్ బుధవారం ఆన్‌లైన్ డెలివరీ యాప్‌లో మూడు ఐస్‌క్రీమ్‌లు ఆర్డర్ పెట్టాడు. అవి తింటున్న సమయంలో ఒకదాంట్లో మనిషి వేలు కనిపించింది. వెంటనే అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయం తెలిసి ఐస్‌క్రీం ప్రియులు ఆందోళన చెందుతున్నారు.