విజయనగరం జిల్లా రాముభద్రాపురంలో దారుణం చోటుచేసుకుంది. ఆరునెలల చిన్నారిపై తాత అయిన వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. చిన్నారిని తల్లి ఊయలలో వేసి గ్రామంలోని కిరాణా దుకాణానికి వెళ్లింది. ఈ సమయంలో బోయిన ఎరకన్న దొర అక్కడికి వచ్చి చిన్నారిపై అత్యాచారం చేశాడు. చిన్నారి ఏడుస్తుండడంతో తల్లి వచ్చిచూడగా.. శిశువు రక్తమోడుతూ ఉంది. పసికూనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు.