మధ్యప్రదేశ్‌లోని గుణ జిల్లాలో దారుణం జరిగింది. అయాన్ పఠాన్ (24) అనే వ్యక్తి.. ఆస్తి కోసం తన ప్రేయసి (23)పై దాడి చేసి, అత్యాచారానికి పాల్పడ్డాడు. బెల్టుతో దాడి చేసి, నానా చిత్రహింసలకు గురిచేశాడు. అరుపులు బయటికి రాకుండా ఆమె నోటిని ఫెవిక్విక్‌తో మూసేశాడు. అతని నుంచి తప్పించుకున్న మహిళ.. తన ప్రాణాలను నిలబెట్టుకొని పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు పఠాన్‌ను అరెస్ట్ చేశారు.