ఇదేనిజం, శేరిలింగంపల్లి: సినిమాల్లో అవకాశం కల్పిస్తానని ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని నమ్మించి లైంగిక దాడికి పాల్పడిన సంఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైజాగ్ కు చెందిన దంతులూరి సిద్ధార్థ వర్మ(30) నగరానికి వచ్చి కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో నివాసం ఉంటున్నాడు. తెలుగు సినిమా పరిశ్రమలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సిద్దార్థ వర్మకు ఓ స్నేహితురాలి ద్వారా బాధిత యువతి వరిచయం అయ్యింది. అనంతపుర్ జిల్లాకు చెందిన బాధిత యువతి నగరంలోని పుప్పాలగూడలో నివాసం ఉంటూ సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంది. కాగా సినిమాల్లో అవకాశం కల్పిస్తానని యువతిని నమ్మించిన సిద్దార్థ వర్మ తన ఇంటికి పిలిపించుకుని, మద్యం సేవించిన తరువాత మద్యం మత్తులో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధిత యువతి మంగళవారం గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు బుధవారం నిందితుడు సిద్దార్థ వర్మను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.